పాతపట్నం మండల కేంద్రంలోని శ్రీ నీలమణి అమ్మవారి ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దర్శించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక దేవాదాయ శాఖ అధికారులతో పాటు అర్చకులు ఆలయ మర్యాదలతో సాధన స్వాగతం పలికారు. ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్థానిక అర్చకులు ఆయనకు ఆశీర్వాదాలు అందజేశారు.