నాటు సారా ఊటల పై దాడులు నిర్వహించిన పోలీసులు

73చూసినవారు
నాటు సారా ఊటల పై దాడులు నిర్వహించిన పోలీసులు
మెలియాపుట్టి మండలంలోని ముకుందాపురం గ్రామంలో పాతపట్నం టెక్కలి, పలాస, ఎస్ ఈ బీ పోలీసులు ఆధ్వర్యంలో సోమవారం సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 1700 లీటర్ల పులిసిన బెల్లపు ఊటలను ధ్వంసం చేయగా.. 120 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో గిరిజన ప్రజలకు సారా వలన జరుగుతున్న నష్టాలను తెలియజేశారు. సారా తయారీ, క్రయ, విక్రయాలకు దూరంగా ఉండాలని పోలీసులు కోరారు.
Job Suitcase

Jobs near you