రైతుల డాక్యుమెంట్లు పరిశీలించి పనులు గుర్తిస్తాం

56చూసినవారు
కొత్తూరు మండలం మెట్టూరు బిట్టు-2 సచివాలయంలో ఉపాధి హామీ అధికారులు గ్రామసభ గురువారం నిర్వహించారు. టెక్నికల్ అసిస్టెంట్ సంజీవరావు మాట్లాడుతూ. గత సంవత్సరంలో మిగిలి ఉన్న పనులను 2025 మార్చి లోపు పూర్తిచేయాలని పేర్కొన్నారు. 2025-2026(కొత్త సంవత్సరం) పనులు ఏప్రిల్ నెల నుండి ప్రారంభమవుతాయన్నారు. రైతుల డాక్యుమెంట్లు పరిశీలించి పనులు గుర్తిస్తామన్నారు. సర్పంచ్ ధర్మారావు, ఉపాధి వేతనదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్