Dec 22, 2024, 00:12 IST/కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్: మల్టీపర్పస్ పార్కుకు డా ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలి
Dec 22, 2024, 00:12 IST
కరీంనగర్ నగరంలో నడిబొడ్డున నగరానికి తలమానికంగా ఇటీవలే ఆధునిక హంగులతో నిర్మించిన మల్టీపర్పస్ పార్క్ కు ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం పేరును పెట్టాలని ఎంఐఎం పార్టీ కో ఆప్షన్ సభ్యురాలు రాఫియా సుల్తానా విజ్ఞప్తి చేశారు. శనివారం మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆమె పలు సమస్యలపై గలమెత్తారు. మల్టీపర్పస్ పార్క్ కు మాజీ రాష్ట్రపతి పేరును పెడితే అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు.