బిగ్‌బాస్ తెలుగు సీజన్-8 తో పేరుతెచ్చుకున్న కంటెస్టెంట్ సోనియా ఆకుల వివాహం శనివారం ఘనంగా జరిగింది. తన ప్రియుడు యష్ వీరగోనిని పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ హాజరు అయ్యారు. తెలంగాణలోని మంథనికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రామ్‌గోపాల్ వర్మ దర్వకత్వంలో రెండు సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.