పొరపాటున హుండీలో పడ్డ ఐఫోన్‌.. దేవుడి ఆస్తిగా ప్రకటించిన ఆలయం

68చూసినవారు
పొరపాటున హుండీలో పడ్డ ఐఫోన్‌.. దేవుడి ఆస్తిగా ప్రకటించిన ఆలయం
తమిళనాడులోని తిరుపోరూర్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఆలయంలోని హుండీలో ఒక వ్యక్తి కానుకలు వేశాడు. అయితే అతడి చేతిలోని ఐఫోన్‌ పొరపాటున హుండీలో పడింది. కంగారు పడిన ఆ వ్యక్తి ఈ విషయాన్ని ఆలయ అధికారులకు చెప్పాడు. అయితే, హుండీలోకి వచ్చే ప్రతిదీ దేవునికే చెందుతుందని, దానిని దేవుని ఆస్తిగా పరిగణిస్తారని ఆలయ అధికారులు వెల్లడించారు. కానీ ఐఫోన్‌లోని డేటాను తీసుకునేందుకు అనుమతిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్