Oct 15, 2024, 18:10 IST/
బిజెపికి సరితా పొగాట్ గుడ్‌బై.. ఆప్‌లో చేరిక
Oct 15, 2024, 18:10 IST
రాజధానిలో బిజెపికి ఎదురు దెబ్బ తగిలింది. రెండు వారాల క్రితమే బిజెపిలో చేరిన మాల్వియా నగర్ వార్డ్ కౌన్సిలర్ సరితా పొగాట్ పార్టీకి గుడ్‌బై చెప్పి తిరిగి ఆప్‌లో చేరారు. స్టాండింగ్ కమిటీ సభ్యుడిని ఎన్నుకునేందుకు సెప్టెంబర్ చివరి వారంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశమైంది. దీనికి ఒక రోజు ముందు సరితా ఫోగట్, మరో ఇద్దరు కౌన్సిలర్లు అమ్ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు.