Feb 17, 2025, 15:02 IST/వేములవాడ
వేములవాడ
వేములవాడ: కోడె మొక్కులు చెల్లించుకున్న బీఆర్ఎస్ నేతలు ఎందుకంటే..!
Feb 17, 2025, 15:02 IST
మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో బీఆర్ఎస్ నేతలు సోమవారం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద భారీ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మొక్కలు నాటి ఉద్యమ నేత మాజీ సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కరుణ కటాక్షాలు మాజీ సీఎం కేసీఆర్ పై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.