సంతబొమ్మాళి మండలం వల్లేవలస లోని మనబడి వెల్ఫేర్ అసోసియేషన్ చేసిన సేవలకు గాను సంస్థ ప్రతినిధులు రెడ్డి సూరిబాబు మాస్టర్, గేదెల శివారెడ్డి, ఇప్పిలి అప్పన్నలను యరకన్నపేట గ్రామ పెద్దలు, యువత ఆదివారం ఘనంగా సన్మానించారు. సంస్థ సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి సూరిబాబు మాట్లాడుతూ పిల్లలను చదివించుకోలేని, అనారోగ్యoతో బాధపడుతున్న కుటుంబాలకు ఏళ్లవేళలా సేవలు అందిస్తామన్నారు.