కోటబొమ్మాలి లో హెల్మెట్ వాడకం పై అవగాహన ర్యాలీ

81చూసినవారు
కోటబొమ్మాలి మండల కేంద్రంలో కోటబొమ్మాలి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి బి. ఎం. ఆర్ ప్రసన్నలత ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సదస్సులో జడ్జి ప్రసన్నలత మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం కుటుంబ రక్షణకు ముఖ్యసాధనం అని అన్నారు. ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబం అభివృద్ధి కుంటు పడుతుందని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్