టెక్కలి ప్రధాన రహదారుల్లో పశువులు స్వైరవిహారం

50చూసినవారు
టెక్కలి మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల్లో రాత్రి, పగలు తేడా లేకుండా పశువులు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో స్థానికులు, వాహనదారులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. టెక్కలి లో ఆవులు విచ్చలవిడిగా సంచరిస్తూ వాహనాలపైకి దూసుకు వస్తున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మంగళవారం స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్