టెక్కలి మండల కేంద్రం లోని ఆర్టీసీ డిపో సమీపంలో ఇసుక ర్యాంపు వద్ద బుధవారం అమ్మవారు వెలసిందని బుధవారం స్థానికులు పూజలు నిర్వహించారు. బుధవారం వేకువజామున ఇసుక ర్యాంపు వద్ద లింగాకారంలో ఉన్న ఒక రాయిని స్థానికులు గుర్తించి దేవుడు వెలిసిందని సిమెంట్ దిమ్మను కట్టి పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ముర్రాటలు సమర్పించిన వీడియోను స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.