టెక్కలిలో పశువుల సంచారంపై అధికారులు చర్యలను కొనసాగిస్తున్నారు. టెక్కలి ప్రధాన రహదారిపై సంచరిస్తున్న పశువులను మంగళవారం రాత్రి గో సంరక్షణశాలకు ఈవో జగన్నాథం ఆధ్వర్యంలో తరలించారు. టెక్కలిలో పశువుల విచ్చలవిడి సంచారంపై ఇప్పటికే అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా టెక్కలి రోడ్లపైకి పశువులను విడిచిపెడితే, అపరాధ రుసుము విధిస్తామని పంచాయతీ అధికారులు స్పష్టం చేశారు.