టెక్కలి: ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడికి గాయాలు

63చూసినవారు
టెక్కలి: ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడికి గాయాలు
టెక్కలి మండల కేంద్రంలోని సమీప జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఓ ద్విచక్ర వాహనం అదుపు తప్పిన ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. యువకుడు అతి వేగంగా రావడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్