మెడిసిన్ విద్యార్థినులు మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లి జల తరంగిణి జలపాతంలో ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో టెక్కిలికి చెందిన సిహెచ్ హరిణి ప్రియ కూడా ఉన్నారు. అయితే ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆమెకి రాజమండ్రిలోని ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఇక సమాచారం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు.