ఈ ఏడాది ఖరీఫ్ పంట పండించిన రైతులు ధాన్యం అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్టు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ధాన్యం విక్రయించే సమయంలో ప్రభుత్వం నిబంధనలు పక్కనపెట్టి మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక బస్తాకి అదనంగా 3నుంచి 6 కిలోల ధాన్యం ఇస్తేనే కొనుగోలు చేస్తున్నారని నందిగాం మండలం పలు గ్రామాలకు చెందిన రైతులు చెబుతున్నారు.