ఉపాధి హామీ తో ఊరి చెరువు అభివృద్ధి

2447చూసినవారు
ఉపాధి హామీ తో ఊరి చెరువు అభివృద్ధి
స్థానిక టెక్కలి గోపినాదపురం గ్రామ ప్రజలు తమ స్వంత ఊరి చెరువు బాగు చేసుకొనుటకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రయోజనకరంగా ఉంది అని జాతీయ బిసి సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధవళ శివ రంగబాబు పేర్కొన్నారు. ఈ పథకం సద్వినియోగం చేసుకుంటే చెరువు ఆక్రమణల నుంచి కాపాడు కోవచ్చు అని పలువురు గ్రామ ప్రజలు మీడియా ఎదుట వాపోయారు. ఈ కార్యక్రమంలో కుశుడు, రాజారావు, తవిటి నాయుడు, రాంబాబు పలువురు గ్రామస్తులు పాలుపంచుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్