AP: భూకబ్జాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం గుంటూరులో నిర్వహించిన నరెడ్కో ప్రాపర్టీ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎప్పుడూ చూడని విధంగా భూ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలే దీనికి ముఖ్య కారణమన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో టీడీఆర్ బాండ్లు తీసుకుని కొంత మంది నష్టపోయారన్నారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.