ఏపీలో హీరో బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలకు బిగ్ షాక్ తగిలింది. బాలయ్య 'డాకు మహారాజ్', వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాల అదనపు షోలలో ప్రభుత్వం సవరణలు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు అర్థరాత్రి ఒంటి గంట, తెల్లవారుజామున 4 గంటల షోలకు అనుమతి నిరాకరించింది. రోజుకు ఐదు షోలకు మించకుండా, అందులో ఒక బెనిఫిట్ షో ప్రదర్శించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ రెండు సినిమాలకు ఆరో షో ఉండకపోవడంతో వసూళ్లపై ప్రభావం చూపే అవకాశముంది.