AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, జేఈవో వెంకయ్య క్షమాపణలు చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై బీఆర్ నాయుడు స్పందించారు. 'ఎవరో చెబితే మేం ఎందుకు క్షమాపణ చెబుతాం? క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా?' అని పవన్ వ్యాఖ్యలను బీఆర్ నాయుడు కొట్టిపారేశారు.