ఏపీ ఎన్నికల నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కొందరు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన లక్షలాది మంది ఆంధ్రా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు. ఇప్పటికే టీడీపీ, వైసీపీ నేతలు సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. మే 13న పోలింగ్ ఉండటంతో అప్పటి వరకు వారిని ఏపీకి తీసుకురావడానికి బస్సులు, రైళ్లలో టికెట్లు బుక్ చేస్తున్నారు.