ఏపీలో ఇటీవల భారీ వర్షాలు, వరదలు కారణంగా అపారమైన నష్టం సంభవించింది. ఈ క్రమంలో వరద బాధితులకు అదానీ గ్రూప్ అండగా నిలిచింది. అదానీ ఫౌండేషన్ ద్వారా రూ.25 కోట్లు అందజేస్తున్నట్లు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వెల్లడించారు. దీనికి సంబంధించిన పత్రాలను ఏపీ సీఎం చంద్రబాబుకు కరణ్ అదానీ అందజేశారు.