పన్నీర్‌తో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పన్నీర్‌లో ప్రొటీన్ మాత్రమే కాకుండా కాల్షియం, ఫాస్ఫరస్, సెలీనియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. పన్నీర్ తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. నరాల సంబంధిత సమస్యలకు ఎంతో దోహదపడుతుంది. అయితే పన్నీర్‌ను అతిగా తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.