సీఎం చంద్రబాబును కదిలించిన ఓ వృద్ధుడి కథ

77చూసినవారు
సీఎం చంద్రబాబును కదిలించిన ఓ వృద్ధుడి కథ
AP: శ్రీకాకుళంలోని ఓ మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్‌కు వలస వెళ్లి బుట్టలు నేస్తూ జీవిస్తున్న ఓ వృద్ధుడి కథ సీఎం చంద్రబాబును కదిలిచింది. ఆయన గురించి ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు శుక్రవారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘ఈయన కథ ఏపీ ప్రజల పనితీరుకి నిదర్శనం. అవకాశాల కోసం ఊరు వదిలి పెట్టడం బాధాకరం. మన రాష్ట్రాన్ని పునర్నిర్మించి అవకాశాలు సృష్టిస్తాం.’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్