భారత్‌కు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త, పర్యావరణ సంరక్షకురాలు పూర్ణిమాదేవి బర్మాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజైన్ వెలువరించిన ’విమెన్ ఆఫ్ ది ఇయర్‘ లో ఆమె చోటు సంపాదించారు. వివిధ దేశాలకు చెందిన 13 మంది మహిళల పేర్లతో టైమ్ ఈ జాబితాను రూపొందించగా.. భారత్ నుంచి పూర్ణిమ ఎన్నికయ్యారు. అయితే పూర్ణిమ కొంగలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ఈమెకు 20 మందితో కూడిన ఒక టీమ్ కూడా ఉంది.