అస్సాంలో కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్, ఆయన ఇద్దరు వ్యక్తిగత భద్రతాధికారులపై అల్లరి మూక దాడి చేసింది. ఈ ఘటనలో హుస్సేన్ క్షేమంగా బయటపడగా.. ఆయన భద్రతా సిబ్బందికి స్వల్పంగా గాయాలయ్యాయి. నాగోన్ జిల్లాలోని గునోమారి గ్రామంలో జరగనున్న పార్టీ సమావేశం కోసం బైక్‌పై వెళ్తున్న ఆయనను అల్లరి మూక అడ్డగించి ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ క్రికెట్ బ్యాట్లతో దాడి చేసింది. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా.. దుండగులు పారిపోయారు.