AP: తాము అధికారంలో ఉన్నపుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలే వైసీపీ ఓటమికి కారణమయ్యాయని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అభిప్రాయపడ్డారు. 'లిక్కర్, ఇసుక పాలసీలు మాకు దెబ్బకొట్టాయి. టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు అరెస్ట్ ఘటన, భువనేశ్వరిని తిట్టడం వంటివి కూటమి, కార్యకర్తలు ఏకం కావడానికి సాయం చేశాయి. పవన్ వైసీపీ హ్యాండిల్ చేసిన విధానం తప్పు' అని ఓ ఇంటర్వ్యూలో కేతిరెడ్డి చెప్పారు.