ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్లంతా రెడ్‌బుక్‌లో ఉన్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో బుధవారం నరసింహస్వామి ఆలయ ముఖ ద్వారాన్ని ప్రారంభించారు. భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టానికి వ్యతిరేకంగా పని చేసిన వారిపై తప్పనిసరిగా చర్యలుంటాయని హెచ్చరించారు.