ఏపీలో వైసీపీకి పలువురు నేతలు గుడ్ బై చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే మరో నలుగురు వైసీపీకి దూరంగా ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారు. అయితే వీరు వైసీపీని వీడి మరో పార్టీలో చేరడానికి అయితే రెడీగా లేరట. అసలు ఇక రాజకీయాలకే స్వస్తి చెప్పాలని చూస్తున్నారట.