AP: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో అధికార వైఫల్యాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాలతో హోం, దేవాదాయ, రెవెన్యూ శాఖ మంత్రులు తిరుపతికి బయల్దేరారు. అక్కడి పరిస్థితులను వారు సమీక్షించనున్నారు. రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అటు ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకోనున్నారు.