తిరుమల: 24న ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

64చూసినవారు
తిరుమల: 24న ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నవంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీనివాసుడి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్స్ అందుబాటులోకి వస్తాయి. ఇక నవంబర్‌లో నిర్వహించే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ 19న ఉదయం 10 గంటల నుంచి 21న ఉదయం 10 గంటల వరకు జరగనుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: ttdevasthanams.ap.gov.in ను సంప్రదించగలరు.

సంబంధిత పోస్ట్