తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట చెరువు ఆక్రమణలపై గురువారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అసెంబ్లీలో ప్రస్తావించారు. చెరువు సుందరీకరణ పేరుతో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా నిధులను తనసొంత నిధులుగా మళ్లించారని అన్నారు. అలాగే చెరువుకు వెళ్లే నీటిని మూసివేయడంతో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. దీనిపై స్పందించిన మంత్రి నారాయణ బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.