శ్రీకాళహస్తి: కన్నుల పండుగగా లక్ష దీపోత్సవం...!

81చూసినవారు
శ్రీకాళహస్తి: కన్నుల పండుగగా లక్ష దీపోత్సవం...!
కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తిలోని నారద పుష్కరిణి నందు లక్ష దీపోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు కార్తిక దీపం వెలిగించి ప్రారంభించారు. నూతన ఆలోచనతో లక్ష దీపోత్సవం ప్రవేశ పెట్టడం పట్ల ఈవోను, సిబ్బందిని అభినందించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఈవో బాపిరెడ్డికి ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏసి కృష్ణారెడ్డి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్