గుడిపాల మండలంలోని రాసనపల్లి అటవీ ప్రాంతం పరిధిలో మెరుపు దాడులు నిర్వహించి 2, 200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు అర్భన్ ఎక్సైజ్ సీఐ శ్రీహరి రెడ్డి మంగళవారం తెలిపారు. రాబడిన సమాచారం మేరకు పిల్లిగుట్ట, సర్దార్ మిట్ట ప్రాంతాలలో బెల్లం ఊటలను ధ్వంసం చేసి రెండు కేసులు నమోదు చేసి పేయనపల్లిలో అక్రమ గంజాయి, నాటు సారా పై అవగాహన కల్పించామన్నారు.