తిరుపతి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా శుభం బన్సాల్ బుధవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ని కలెక్టర్ క్యాంపు ఆఫీసు నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జే. సి శుభం బన్సాల్ ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించాలన్నారు.