చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా రోజురోజుకు రెచ్చిపోతుందని స్థానికులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలసముద్రం మండలం బలిజ కండ్రిగ సమీపంలో బుధవారం ఉదయం తమిళనాడుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. అధికారులు ఎంత నిఘా ఉంచిన పాలసముద్రం మండలం మీదుగా తమిళనాడుకు ఇసుక తరలిపోతూనే ఉందని స్థానికులు తెలిపారు.