చేగువేరా వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడే లాటిన్ అమెరికా మొత్తం పర్యటించాలనుకున్నాడు. ఆ ప్రయాణమే ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వలస సామ్రాజ్యవాదుల పాలనలో మగ్గిపోతూ కనీస అవసరాలైన తిండి, గూడు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బానిస బతుకులు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న కోట్లాది ప్రజల బాధలను ఆకలిచావులను కళ్లారా చూశాడు. అప్పుడే లాటిన్ అమెరికాలోని బానిసల జీవితాలలో వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నాడు.