ఇజ్రాయెల్-హెజ్బుల్లా మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. రెట్టింపు రాకెట్ల దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్, బీరుట్ పై బాంబుల వర్షం కురిపించగా హెజ్బుల్లా కీలక కమాండర్ మరణించాడు. దీనికి ప్రతీకారంగా హెజ్బుల్లా మంగళవారం ఇజ్రాయెల్ పైకి రాకెట్ దాడులతో విరుచుకు పడింది. వరుసగా 170 రాకెట్లను ప్రయోగించింది. లెబనాన్ సరిహద్దులోని ఇజ్రాయెల్ పౌరులను ఖాళీ చేయించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.