మంగళవారం మధ్యాహ్నం కలకత్తా నుండి చెన్నై వెళ్లే జాతీయ రహదారిపై మనుబోలు క్రాస్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి చేతిపై షాడో అనే పచ్చబొట్టు వేసి ఉంది. సంఘటన స్థలానికి మనుబోలు ఎస్ఐ జి. అజయ్ కుమార్ చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.