మనుబోలు మండలం గురివిందపూడి గ్రామంలో మంత్రి కాకాణి. గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం గురివిందపూడి విచ్చేసిన మంత్రి స్థానిక నేత సుధీర్ రెడ్డి తో కలిసి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొని రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.