వి.కోటలోపి అంబేద్కర్, వైస్సార్ సర్కిల్ నందు శనివారం స్వాతంత్ర సమరయోధుడు, రేనాటి వీరుడు, వడ్డెర జాతి ముద్దు బిడ్డ వడ్డె ఓబన్న 218 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వడ్డెర సంఘం నాయకులు డా. యం. డి. హెచ్. పవన్ కళ్యాణ్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన పోరాట స్పూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు.