పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ దామోదర్ దురుసుగా ప్రవర్తించి యువకుడిపై చేయి చేసుకున్న ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన మహబూబ్ బాషా కొత్తపేటలో చికెన్ దుకాణం సాగిస్తున్నాడు. వ్యాపార లావాదేవీల కారణంగా మరో వ్యక్తికి డబ్బులు బాకీ పడ్డాడు. సరైన సమయంలో చెల్లించనందున అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా మహబూబ్ ను స్టేషన్ కు పిలిపించి ఏఎస్ఐ తనపై చేయి చేసుకున్నాడని బాధితుడు తెలిపాడు.