జాతీయ స్థాయి త్రో బాల్ పోటీలకు పుంగనూరు నియోజకవర్గం సోమల ఉన్నత పాఠశాల విద్యార్థి అయ్యప్ప చరణ్ తేజ్ ఎంపికైనట్టు హెచ్ఎం హరినాథ్, పీడి కరుణానిధి మంగళవారం తెలిపారు. పూతలపట్టులో జరిగిన అండర్ 14 త్రో బాల్ పోటీల్లో విద్యార్థి ప్రతిభ చూపడంతో రాష్ట్రస్థాయి సెలక్షన్ కమిటీ అతనిని ఎంపిక చేసినట్టు వారు చెప్పారు. రాష్ట్ర జట్టు తరఫున ఢిల్లీలో త్వరలో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో అతడు పాల్గొంటారని వెల్లడించారు.