వైభవంగా ధర్మరాజ స్వామి గ్రామోత్సవం

70చూసినవారు
వైభవంగా ధర్మరాజ స్వామి గ్రామోత్సవం
సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరులో జరుగుతున్న ధర్మరాజు తిరునాళ్ళలో భాగంగా గురువారం పాండవ అగ్రజుడు ధర్మరాజు ఊరేగింపు వైభవంగా సాగింది. సాయంత్రం ప్రారంభమైన ధర్మరాజు ఉత్సవం ముందు మంగళ వాయిద్యాలు, తమిళ పారంపర్య కళ అయిన కరగాట్టం నృత్యం ఆకర్షణగా నిలిచింది. పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతనం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.