పిచ్చాటూరులోని ఆరణియార్ ప్రాజెక్ట్ వద్ద చేపడుతున్న టూరిజం పనులు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రామానాయుడు, రైతు సంఘం నేత జనార్దన్లు పేర్కొన్నారు. మంగళవారం సీపీఐ, రైతు సంఘం ప్రతినిధులు ఆరణియార్ ప్రాజెక్టును సందర్శించి చెరువు లోపల రూ. 2 కోట్ల తుడా నిధులతో జరుగుతున్న టూరిజం పనులను పరిశీలించారు. వెంటనే నిలిపి వేయాలని వారికి సూచించారు.