శ్రీకాళహస్తి పట్టణంలో గురువారం కోర్ట్ ఆవరణంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కోర్టులో ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి జిల్లా జడ్జి శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ బేబీ రాణి ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ధర్మారావు పోలీస్ అధికారులు లాయర్లు పాల్గొన్నారు.