తెదేపా ప్రభుత్వంలోనే అభివృద్ధి సంక్షేమం: నెలవల

85చూసినవారు
తెదేపా ప్రభుత్వంలోనే అభివృద్ధి సంక్షేమం: నెలవల
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఏక కాలంలో జరగాలంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. గురువారం దొరవారిసత్రం మండలం లోని నెలబల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక నాయకులతో మాట్లాడి ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కోరారు.

ట్యాగ్స్ :