కడపలోని పెద్ద దర్గాలో ఉర్సు ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 16న ప్రారంభమయ్యే ఈ ఉరుసు ఉత్సవాలు దాదాపు వారం రోజుల పాటు జరుగుతాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు ఈ దర్గాని సందర్శిస్తుంటారు. కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాల నేపథ్యంలో రేపు (శనివారం) కడపలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు జిల్లా అధికారులు సెలవు ప్రకటించారు.