AP: శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలంలో మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఇంజిన్ తిరగపడటంతో డ్రైవర్ మృతి చెందాడు. శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అటుగా వెళ్తున్న రైతులు ప్రమాదాన్ని గుర్తించి ట్రాక్టర్కు ట్రాలీకి మధ్య ఇరుక్కున్న ఆదికేశవ మృతదేహాన్ని అతి కష్టంతో బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.