నరసాపురం ఎంపీడీవో మిస్సింగ్ కేసులో ట్విస్ట్
నరసాపురం ఎంపీడీవో వెంకటరమణా రావు అదృశ్యం కేసు కీలక మలుపు తిరిగింది. నిన్న ఇంటి నుంచి బయటికెళ్లిన ఆయన.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా కుటుంబ సభ్యులకు వాట్సాప్ మెసేజ్ పంపారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఆయన మొబైల్‌ను ట్రాక్ చేశారు. విజయవాడ మధురానగర్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఏలూరు కాల్వ దగ్గర సిగ్నల్ కట్ అయినట్లు గుర్తించారు. కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు మృతదేహం కోసం గాలిస్తున్నారు.